: కరెంటు వాడకంలో భాగ్యనగరి ఆల్ టైం రికార్డు


ఎండలు ఎన్నడూ లేనంతగా మండిపోతున్న వేళ, గ్రేటర్ హైదరాబాద్ లో కరెంటు వాడకం ఆల్ టైం రికార్డుకు చేరింది. గత సంవత్సరం మే 26వ తేదీన 5.32 కోట్ల యూనిట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం జరుగగా, ఈ నెల 5వ తేదీన ఏకంగా 5.47 కోట్ల యూనిట్ల విద్యుత్ ఖర్చయింది. నెల రోజుల ముందే పాత రికార్డులు బద్దలు కావడం, భానుడి ప్రకోపం మరింతగా పెరగవచ్చన్న అంచనాలతో, మే నెలలో 5.8 కోట్ల యూనిట్ల వరకూ విద్యుత్ కు డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నామని, 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ ను అందిస్తామని తెలంగాణ రాష్ట్ర డిస్కమ్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి వివరించారు. కాగా, వేడికి భూగర్భ విద్యుత్ వైర్ల జాయింట్లు కరుగుతున్నాయని, ట్రాన్స్ ఫార్మర్లలో ఆయిల్ లీకేజీలు పెరిగాయని తెలుస్తోంది. దీంతో శివారు ప్రాంతాల్లో లోడ్ రిలీఫ్ ల పేరిట విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News