: చీప్ పబ్లిసిటీ కోసం చెప్పులు వేయించుకొంటున్నారు: ఆప్ పై మండిపడ్డ బీజేపీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై షూ విసిరిన ఘటనలో తమ ప్రమేయం లేదని బీజేపీ వివరణ ఇచ్చింది. "ఈ ఘటనతో బీజేపీకి ఎంతమాత్రమూ సంబంధం లేదు. ఆయనపై షూ విసిరిన వేద్ ప్రకాష్ ఆప్ కార్యకర్తే" అని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి ప్రవీణ్ కపూర్ వ్యాఖ్యానించారు. చీప్ పబ్లిసిటీ కోసం చెప్పులు వేయించుకుంటున్నారని అసెంబ్లీలో విపక్ష నేత విజేందర్ గుప్తా దుయ్యబట్టారు. ఆప్ నేతలపై గతంలోనూ ఇదే తరహా దాడులు జరిగాయని గుర్తు చేసిన ఆయన, సదరు ఘటనలపై ఒక్కసారన్నా విచారణ సక్రమంగా జరుగలేదని, నిందితులకు శిక్ష పడలేదని తెలిపారు. మీడియా సమావేశాల్లో ఇలా షూలు విసిరించుకోవడం వాళ్లకు అలవాటేనని ఎద్దేవా చేశారు.