: మంత్రి వర్గంలో నేనున్నా, సుజాత ఉన్నా, ప్రభాకర్ ఉన్నా ఒకటే: మాగంటి బాబు
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఎంపీ మాగంటి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో ఓ కార్యక్రమంలో మంత్రులు రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, విప్ చింతమనేని ప్రభాకర్ పాల్గొన్న సభలో మాగంటి బాబు మాట్లాడుతూ, మంత్రి వర్గంలో సుజాత ఉన్నా, ప్రభాకర్ ఉన్నా, తాను ఉన్నా ఒకటేనని అన్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశ్యం పీతల సుజాతను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాదని ఆయన వివరణ ఇచ్చారు. జిల్లాలో మరో వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్నదే తన వ్యాఖ్యల ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.