: పెద్ద ప్రసంగాలు చేయడం చాలా సులభం: మోదీకి మమత చురకలు


బహిరంగ సభలు, ర్యాలీల్లో పెద్దపెద్ద ప్రసంగాలు చేయడం చాలా సులభమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, ఆ ప్రసంగాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం మోదీకి చేతకాదని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలా మోదీ మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. మన్ కీ బాత్ లో మోదీ అసలు స్వరూపాన్ని దైవం మాత్రమే తెలుసుకోగలదని ఆమె అన్నారు. ఏ కారణంగా అయినా ప్రధాని తనను అరెస్టు చేయవచ్చు కానీ, తాను మాత్రం ఆయన ముందు తలవంచి బెంగాల్ బిడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ అంటే 'భయానక్ జైల్ పార్టీ' అని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News