: పశ్చిమబెంగాల్‌లో రాజుకుంటున్న ఎన్నిక‌ల వేడి.. టీఎంసీ నాయకుడి దారుణ హత్య


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నిక‌లంటే అక్క‌డి ప‌రిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవ‌చ్చు. అక్క‌డ సార్వత్రిక సంగ్రామ‌మంటే పరస్పర విమర్శలే కాదు, దాడులు జరుపునే సంఘ‌ట‌న‌లూ ఎక్కువే. తాజాగా పార్టీల మధ్య పోటీ తీవ్రతరమై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు తృణ‌మూల్ కాంగ్రెస్ నాయకుడు జయదేవ్ జానాపై దాడికి దిగి, హ‌త్య చేసి ప‌రార‌య్యారు. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొని వ‌స్తోన్న జ‌య‌దేవ్‌పై దుండ‌గులు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేయ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ హ‌త్య‌పై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప‌లువురు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే ఈ హత్య‌కు కార‌ణ‌మని జయ‌దేవ్ కుటుంబం ఆరోపిస్తోంది. హ‌త్య‌కు బాధ్యులుగా ఓ కాంగ్రెస్ నాయ‌కుడు స‌హా ప‌లువురి పేర్ల‌ను ఆయ‌న కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News