: మ్యాచ్‌లను తరలించి రూ.100కోట్ల ఆదాయం వదులుకుంటారా: బీసీసీఐ కార్యదర్శి
మహారాష్ట్రలో తీవ్ర నీటి కొరత నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు నీళ్లు సరఫరా చేయబోమని, మ్యాచ్‌లు వేరే స్టేడియాలకు మార్చినా తమకు ఎలాంటి సమస్య లేదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆ రాష్ట్రం నుంచి మ్యాచ్‌లను తరలిస్తే మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల ఆదాయం రాకుండా పోతుందని అన్నారు. క్రికెట్ స్టేడియాల్లో పిచ్‌లను తడిపేందుకు వేల లీటర్ల నీళ్లు వృథా అవుతాయని నెలకొన్న ఆందోళనపై ప్రస్తావిస్తూ.. వీటి కోసం మంచినీటిని వినియోగించుకోబోమని తెలిపారు. మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోవచ్చని అన్నారు.