: యూపీఏ, ఎన్డీఏ కూటములకు ప్రత్యామ్నాయం.. మళ్లీ తెరపైకి 'జనతా పరివార్'
దేశంలోని యూపీఏ, ఎన్డీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా జనతా పరివార్ మళ్లీ తెరపైకి రానున్నట్లు సమాచారం. దీని కోసం చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు జరగనున్న నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్‌లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ను జేడీ(యు) అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అనంతరం నితీశ్‌కుమార్ రాష్ట్రీయ లోక్ దళ్ నేత అజిత్ సింగ్, సమాజ్ వాది జనతాపార్టీ నేత కమల్ మొరార్కా, జార్ఖండ్ వికాస్ మోర్చా నేత బాబులాల్ మరండిలతో చర్చించి విలీన ప్రయత్నాలు సాగిస్తారు. ఈ విలీన ప్రక్రియను 2017లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. తమ ఎన్నికల సింబల్‌గా సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుత గుర్తయిన 'మర్రిచెట్టు' కావాలని జేడీ(యు) అభిలషిస్తోంది.