: జగన్ కు మరో షాక్!... చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి భేటీ


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జగన్ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. నేటి ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి వచ్చిన చంద్రబాబును, ఆయన వచ్చీ రావడంతోనే దేశాయి తిప్పారెడ్డి కలవడం జరిగింది. వైసీపీ టికెట్లపై విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల టీడీపీలోకి చేరుతున్న క్రమంలో చంద్రబాబుతో తిప్పారెడ్డి భేటీ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకే తెర తీసింది. పార్టీ మారుతున్నట్లు తిప్పారెడ్డి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకున్నా, చంద్రబాబుతో ఆయన భేటీ... పార్టీ మారే క్రమంలో జరిగిందేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News