: బీహార్‌లో మద్యం లభించక మందుబాబుల వింత ప్రవర్తన.. ఒక పోలీస్ సహా ఇద్దరి మృతి
మద్యపానరహిత రాష్ట్రంగా బీహార్‌ను తీర్చిదిద్దేందుకు బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ అలవాటు పడిన మందు నోట్లో పడకపోవడంతో అక్కడి మందుబాబులు వింతగా ప్రవర్తిస్తున్నారు. మద్యం దొరక్క వింతగా ప్రవర్తిస్తూ ఆసుపత్రిలో చేరిన ఇద్దరు మృతి చెందారు. వీరిలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి కూడా ఉన్నాడు. మద్యానికి బాగా అలవాటు పడిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రఘునందన్ బెస్రా.. పాట్నాలోని పీఎమ్‌సీహెచ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మందుకు బానిసైన మరో వ్యక్తి కేఎమ్‌సీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అలవాటును మాన్పించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను మందుకు బానిసైన వారు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.