: వైఎస్ జగన్... పొలిటికల్ సూపర్ స్టార్!: వైసీపీ 'ఉగాది ఆస్థానం'లో సిద్ధాంతి


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పొలిటికల్ సూపర్ స్టార్ అట. అయినా సినిమాల్లో కదా సూపర్ స్టార్లు ఉండేది, రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారనేగా మీ అనుమానం? దుర్ముఖి నామ సంవత్సరాదిని పురస్కరించుకుని నిన్ననే ఏపీ రాజకీయాల్లోకి కూడా సూపర్ స్టార్లు వచ్చేశారు. నిన్న హైదరాబాదు లోటస్ పాండ్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన ఉగాది ఆస్థానంలో భాగంగా పంచాగ శ్రవణం వినిపించిన ప్రముఖ పంచాంగకర్త మారేపల్లి రామచంద్రశాస్త్రి...ఈ కొత్త పదాన్ని తొలిసారిగా వాడారు. తన పంచాంగ శ్రవణంలో భాగంగా సాంతం వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల చుట్టే తిరిగిన మారేపల్లి... జగన్ ను పొలిటికల్ సూపర్ స్టార్ గా అభివర్ణించారు. కుట్రలు, కుతంత్రాలతో పెట్టిన అన్ని కేసుల నుంచి కడిగిన ముత్యంలానే కాక 24 కేరట్ల బంగారంలా జగన్ బయటపడతారని శాస్త్రి సెలవిచ్చారు. అంతేకాకుండా దుర్ముఖి నామ సంవత్సరంలో వైసీపీ భవిష్యత్తు బ్రహ్మాండంగానూ ఉందని మారేపల్లి వెల్లడించారు. రాష్ట్రంలో చల్లని గాలి వీయాలంటే ఫ్యాన్ అధికారంలోకి రావాల్సిందేనని కూడా ఆయన సెలవిచ్చారు.

  • Loading...

More Telugu News