: శరవేగంగా తాత్కాలిక సచివాలయం నిర్మాణం... శ్లాబ్ దశకు చేరుకున్న నిర్మాణాలు


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఫిబ్రవరి 17న తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాలకు సీఎం నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే కాంట్రాక్టును దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ కంపెనీలు పనులు ప్రారంభించాయి. ఆధునిక యంత్ర సామగ్రితో కొనసాగుతున్న పనులు రెండు నెలలు కూడా గడవక ముందే తొలి శ్లాబ్ (ఫస్ట్ ఫ్లోర్) దశకు చేరుకున్నాయి. రెండు కంపెనీలు కూడా శరవేగంగా పనులు చేస్తున్నాయి. నిర్మాణ ప్రదేశంలోనే రెడీ మిక్స్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్న ఆ కంపెనీలు పనుల్లో మరింత వేగాన్ని పెంచనున్నాయి. వెరసి నిర్దేశిత గడువు (జూన్ లోగానే) నాటికి తాత్కాలిక సచివాలయం పనులు పూర్తవడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News