: జంప్... వైకాపా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, 25 మంది సర్పంచ్ లు తెదేపాలోకి!


ఉగాది రోజున వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించిన ఇద్దరు ఎమ్మెల్యేలూ కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైకాపా శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు, సునీల్ కుమార్ లకు పచ్చ కండువాలు కప్పిన చంద్రబాబు, వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. వీరితో పాటు వైకాపాకు చెందిన 25 మంది సర్పంచ్ లు, 26 మంది ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీపీ తెలుగుదేశంలో చేరారు. అందరూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.

  • Loading...

More Telugu News