: బీహార్‌లో పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం


బీహార్‌లో నితీశ్ కుమార్ ప్ర‌భుత్వం కొత్త మద్యం పాల‌సీని తీసుకు వ‌చ్చి, ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లో పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో, మద్యపానరహిత రాష్ట్రంగా బీహార్‌ను తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో అక్ర‌మ మద్యం అమ్మ‌కాల‌పై అధికారులు ప‌క‌డ్బందీగా దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల్లో వేల లీటర్ల మద్యం ప‌ట్టుబ‌డుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్ర‌మ మ‌ద్యం అమ్మ‌కాల‌పై పోలీసులు జ‌రిపిన దాడుల్లో 16 వేల లీటర్ల పైగా మద్యాన్ని సీజ్ చేశారు. అక్ర‌మ మ‌ద్యాన్ని ప్రోత్స‌హిస్తోన్న‌ 44 మందిని అరెస్టు చేశారు. అధికారులు జ‌రిపిన దాడుల్లో 14,108 లీటర్ల దేశీయ బ్రాండ్ల మ‌ద్యం బాటిళ్లు ప‌ట్టుబ‌డ‌గా, 2,386 లీటర్ల విదేశీ బ్రాండ్ల మద్యం ప‌ట్టుబ‌డింది. అక్ర‌మంగా మ‌ద్యాన్ని ప్రోత్సహిస్తే ఉపేక్షించబోమ‌ని అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News