: 20 లక్షల మంది తనను ఫాలో అవుతుంటే, ఎవరినీ ఫాలో కాని ప్రిన్స్ మహేష్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. ఇటీవలే తెలుగు హీరోల్లో ఎవరికీ సాధ్యంకాని ఫీట్ సాధించారు. సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ లో ఫాలోయర్ల సంఖ్యను 20 లక్షలకు చేర్చుకున్న ఘనత ఆయనదే. ఇంతమంది ఆయన్ను ఫాలో అవుతుంటే, ఆయన మాత్రం ఎవరినీ ఫాలో కావడం లేదు. తన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పెడుతున్న ట్వీట్లను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నాడు. మన ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి, బాలీవుడ్ హీరో అమితాబ్, క్రికెటర్ సచిన్ వంటి వందలాది మందిని ఫాలో అవుతున్న వేళ, మహేష్ మాత్రం ఎవరినీ ఫాలో కాకపోవడం గమనార్హం. అన్నట్టు ఉగాది సందర్భంగా తన అభిమానులకు ఈ ఉదయం ఆయన శుభాకాంక్షలు చెప్పారు.