: సినాయ్‌లో బాంబు పేలుడు.. 'పాల్పడింది మేమే'.. ఐఎస్ఐఎస్ వెల్లడి
ఈజిప్ట్‌లోని సియాన్‌లో ఈ రోజు బాంబు పేలుడు కలకలం రేపింది. ఐఎస్ఐఎస్ ఉగ్రమూకలు అక్కడి రఫా, షేక్ జువాయేద్‌లో మరోసారి రెచ్చిపోయారు. ఈ ప్రాంతాల్లో రహదారుల పక్కన ఉగ్రవాదులు రిమోట్ బాంబులు అమర్చి సైనికాధికారులను బలిగొన్నారు. ఘటనలో ఆ దేశ మిలటరీ అధికారి సహా మరో ఏడుగురు సైనికులు మృత్యువాత పడ్డారు. అనంతరం ఈ దాడులకు బాధ్యత తమదేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది.