: ‘పఠాన్ కోట్’ ముష్కరుల గుర్తింపులో పాకిస్థానీల సాయం!


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై మెరుపు దాడికి దిగిన ఉగ్రవాదులు... భారత భద్రతకు సవాల్ విసిరారు. దాడిలో ఏడుగురు గరుడ కమెండోలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు ఆ తర్వాత హతమయ్యారు. అయితే దాడికి దిగింది పాకిస్థాన్ జాతీయులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎలా గుర్తించింది? ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్న పాక్ వంటకాల ప్యాకెట్లు, సెల్ ఫోన్ సంభాషణలు ఇందులో కీలకంగా మారాయని తెలుసు. అయితే వారి గుర్తింపునకు సంబంధించి ఎన్ఐఏ భారీ కసరత్తే చేసిందట. చనిపోయిన నలుగురు ఉగ్రవాదుల ఫొటోలను తమ వెబ్ సైట్ లో పెట్టిన ఎన్ఐఏ... వారి గురించిన వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరింది. ఈ క్రమంలో పలు దేశాల నుంచి ఎన్ఐఏ అధికారులకు ఫోన్లు వచ్చాయి. ఈ ఫోన్లలో పాకిస్థానీయుల నుంచి వచ్చిన ఫోన్లు కూడా ఉన్నాయట. పాక్ భూభాగం నుంచి ఎన్ఐఏ అధికారులకు ఫోన్ చేసిన వ్యక్తులే... ఉగ్రవాదులు ఎవరన్న విషయాలను వెల్లడించారు. ఈ మేరకు మొన్న భారత్ వచ్చిన పాక్ జాయింట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(జేఐఏ)కి చెందిన అధికారులకు ఎన్ఐఏ అధికారులు సమగ్ర వివరాలు అందజేశారు. ఎన్ఐఏ వాదనతో ఏకీభవించిన జేఐఏ.. ఉగ్రవాదులు తమ దేశానికి చెందిన వారేనని దాదాపుగా ఒప్పేసుకున్నారు. అయితే పాక్ చేరిన వెంటనే వారు తమ మాట మార్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News