: నేను భారత బిడ్డనే, రొట్టె, పప్పు తిని బతుకుతున్నా: దలైలామా
తాను భరతమాత బిడ్డనేనని, రొట్టె, పప్పు తిని బతుకుతున్నానని టిబెటన్ల మత గురువు, చైనా శత్రువుగా భావిస్తున్న దలైలామా వ్యాఖ్యానించారు. ఓ టెలివిజన్ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ నోబెల్ బహుమతి విజేత, టిబెట్ లో పరిస్థితులు తనకు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తాను ఏదైనా మాట్లాడితే, టిబెట్ యువత, ప్రజలు బాధపడతారని అన్నారు. తన మనసులోని బాధను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానని, తన వైఖరిని ఎవరు విమర్శించినా పట్టించుకోదలచుకోలేదని స్పష్టం చేశారు. ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడరాదని హితవు పలికారు. టిబెటన్లు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే తన మనసు బాధపడుతుందని అన్నారు.