: 'సర్దార్ గబ్బర్ సింగ్'కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన 'ఇండియన్ సినిమా మేగజీన్'
'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదలైంది...రేపు కదా విడుదల ఈ రోజు విడుదలేంటి? అనుకుంటున్నారా? 'యూఏఈ' (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) లో ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. ఈ సినిమాకు 'ఇండియన్ సినిమా మేగజీన్' ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇది పైసా వసూలు సినిమా అని ఈ మేగజీన్ ఎడిటర్, యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు, యూఏఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఉమేర్ సంధు ట్విట్టర్లో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మార్నింగ్ షో హౌస్ ఫుల్ అయిందని తెలిపారు. తొలిరోజు వసూళ్లు రికార్డులు క్రియేట్ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఒంటి చేత్తో సినిమాను నిలబెట్టాడని, కాజల్, విలన్ శరద్ ఖేల్కర్ అద్భుతంగా నటించారని ఆయన పేర్కొన్నారు. దేవీశ్రీప్రసాద్ మంచి సంగీతం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.