: 'ఆ మహిళా కో- పైలట్టే' కావాలంటూ విమానం ఆపిన ఘటనపై దర్యాప్తు


తాను కోరుకున్న మహిళా పైలట్ కో పైలట్ గా కావాలంటూ ఓ పైలట్ ఎయిరిండియా విమానాన్ని రెండున్నర గంటలకు పైగా ఆపేసిన ఘటనపై ఎయిరిండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఎయిర్ ఇండియా ఇలాంటి ఘటనలను సహించదని ఎయిరిండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ లోహనీ తెలిపారు. క్రమశిక్షణా రాహిత్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా, నిన్న 110 మంది ప్రయాణికులతో చెన్నె నుంచి మాలి వెళ్లాల్సిన విమానంలో సదరు పైలట్ తాను కోరుకున్న మహిళా కో పైలట్ ను ఇవ్వాలంటూ సుమారు రెండున్నర గంటల పాటు విమానాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News