: బెల్జియం బాంబు పేలుళ్ల నిందితుడు యూరోపియన్ పార్లమెంటులో పని చేశాడు


బెల్జియం బాంబు పేలుళ్ల నిందితుడు నదీమ్ లాచ్రోయ్ యూరోపియన్ పార్లమెంటులో పని చేశాడన్న వార్త కలకలం రేపుతోంది. 2009-10 వేసవిలో నెల రోజులపాటు నదీమ్ లాచ్రోయ్ పార్లమెంటు పరిశుభ్రత వ్యవహారాలు చూసే సంస్థలో పనిచేశాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే నదీమ్ లాచ్రోయ్ తమ వద్ద పని చేసినప్పుడు అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేవని ఆ సంస్థ నివేదిక ఇచ్చిందని యూరోపియన్ పార్లమెంటు తెలిపింది. కాగా, టెర్రరిజంపై యుద్ధంలో బెల్జియం విఫలమైందన్న ఆరోపణలను ఆ దేశ ప్రధాని చార్లెస్ మైఖేల్స్ ఖండించారు. టెర్రరిజాన్ని అంతం చేసేందుకు 30 రకాల చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. అమెరికాపై బాంబుదాడులు చేసిన ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకునేందుకు పదేళ్లు పడితే...పారిస్ దాడులకు పాల్పడిన అబ్దెస్లామ్ ను నెలల వ్యవధిలో పట్టేశామని ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉన్నవారు నిందలు, ఆరోపణలు ఎదుర్కోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. బెల్జియం సాధారణ స్థితికి వస్తోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News