: ఈ నెల 20, 21న అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం


దక్షిణాది రాష్ట్రాల్లో కలకలం రేపిన అగ్రిగోల్డ్ కేసుపై నేడు తెలుగు రాష్ట్రాల హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ నెల 20, 21 తేదీల్లో అగ్రిగోల్డ్ కు చెందిన ఆరు ఆస్తులను వేలం వేయనున్నట్టు ఆస్తుల వేలం కమిటీ హైకోర్టుకు తెలిపింది. మరో రెండు రోజుల్లో మిగిలిన ఆస్తుల వివరాలు కమిటీకి తెలియజేస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యం న్యాయస్థానానికి చెప్పింది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, డిపాజిటర్లను ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది బాధితులు న్యాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News