: అటూ ఇటూ తిర‌గ‌డానికి ఇది ప‌శువుల సంతా?: కేంద్రం త‌ర‌ఫు న్యాయ‌వాదిపై సుప్రీం ఆగ్ర‌హం


స్వరాజ్‌ అభియాన్ సంస్థ దేశంలో క‌రవు ప‌రిస్థితిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ విష‌యంపై విచారణకు కేంద్రం తరఫున సుప్రీంకోర్టులో హాజ‌రు కావాల్సిన న్యాయవాది ఆల‌స్యంగా రావ‌డంతో న్యాయ‌స్థానం తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. కేంద్రం త‌ర‌ఫున వ‌చ్చిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కోర్టు హాల్‌లోకి వస్తూనే తాను వాదించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అప్పటికే న్యాయ‌వాది కోసం ఎదురుచూస్తోన్న సుప్రీంకోర్టు ఆగ్రహంతో 'కేసు పట్ల సీరియస్ గా వుండండి. మాకు పనేమీ లేదనుకుంటున్నారా?' అంటూ ప్ర‌శ్నించింది. రైతుల్ని బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డేలా చేస్తోన్న‌ కరవుపై విచారణ నేప‌థ్యంలో 15 నిమిషాలు ఆలస్యంగా వ‌చ్చిన న్యాయవాదిపై అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హించి చివాట్లు పెట్టింది. 'అటూ ఇటూ ప‌రుగులు తీయ‌డానికి ఇదేమైన ప‌శువుల సంత‌లాంటి ప్ర‌దేశం అనుకుంటున్నారా'..? అని ప్ర‌శ్నించింది. 'క‌ర‌వు అంశంపై విచార‌ణ ముఖ్య‌మైన విష‌యం కాదా..? ఇక్కడ ఇద్దరం జడ్జీలం కూర్చుని వున్నాం. మీకోసం మేము వేరే పని చేయకుండా గడియారం వైపు చూస్తూ సమయాన్ని గడపాలా?' అంటూ ప్ర‌శ్నించింది.

  • Loading...

More Telugu News