: కొనవద్దంటే... అమ్మేవారి గతేంటి?... ఫ్రాన్స్ లో సెక్స్ వర్కర్ల నిరసనలు!


ఫ్రాన్స్ లో వ్యభిచార నిరోధానికి తెచ్చిన కొత్త చట్టం అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పటివరకూ చట్టబద్ధంగా వ్యభిచారం చేస్తూ తమ పొట్టపోసుకుంటున్న వందలాది మంది యువతులు ఇప్పుడు రోడ్లెక్కి నిరసన తెలిపారు. శరీరాన్ని అమ్ముకోవడం తప్పు కాదంటూనే, ఆ సుఖం కోసం డబ్బులు ఇచ్చేవారిపై కఠినంగా వ్యవహరించి, భారీ జరిమానాలు విధించాలని కొత్త చట్టం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకవైపు అమ్ముకోవచ్చని చెబుతూనే, మరోవైపు కొనేవారిని అడ్డుకుంటే తమ గతేంటని, తమకు క్లయింట్లు ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నిస్తూ, వందలాది మంది సెక్స్ వర్కర్లు ఫ్రాన్స్ వీధుల్లో ప్రదర్శనలకు దిగారు. కాగా, ఫ్రాన్స్ లోని సెక్స్ వర్కర్లలో 85 శాతం మంది విదేశాల నుంచి అక్రమంగా తరలించబడ్డ వారే కావడంతో, దొరికిన వారందరి నుంచీ పాస్ పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో వ్యభిచారం జోలికి వెళ్లబోమని హామీ ఇస్తే, వారి పాస్ పోర్టులను వెనక్కిచ్చేస్తామని, ఉపాధిని కల్పిస్తామని ఫ్రాన్స్ ప్రభుత్వం హామీలు ఇస్తోంది.

  • Loading...

More Telugu News