: పాము కాటుతో వేదికపైనే నురుగలు కక్కుతూ కుప్పకూలిన పాప్ సింగర్


వేదికపై ప్రదర్శన ఇస్తూ పాము తోకతొక్కిన పాప్ సింగర్ ను అది కరవడంతో వేదికపైనే నురుగలు కక్కుతూ కుప్పకూలిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...పాప్ సింగర్ ఇమ్రా బులే (29) మాధుర్యంగా పాటలు పాడుతుంది. మధ్యలో కొండచిలువలు, నాగుపాములు వంటి విష సర్పాలను ఆడిస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇదే ఆమె ప్రాణాలకు ప్రమాదం తెచ్చింది. వెస్ట్ జావాలోని కారవాంగ్ గ్రామంలో ఇమ్రా ఓ ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా పాటలు పాడుతూ రియాంటీ అనే విషసర్పంతో విన్యాసాలు చేసింది. ఈ సందర్భంగా ఏమీ కాలేదు. అయితే, పాట మధ్యలో వేదికపై ఒకవైపు నుంచి రెండో వైపుకు వెళ్తున్న సమయంలో పొరపాటున ఆ పాము తోకను తొక్కింది. అంతే, అది ఒక్కసారిగా బుసకొట్టి ఆమె తొడమీద కాటేసింది. దీంతో పాముల పర్యవేక్షకుడు దానిని పట్టుకుని లాగినప్పటికీ అప్పటికే జరగరానిది జరిగిపోయింది. అప్పటికే అది కోరల్లో విషాన్ని ఆమె శరీరంలోకి ఎక్కించేసింది. ఆ తర్వాత కూడా ఆమె మామూలుగా ప్రదర్శన కొనసాగించింది. సుమారు 45 నిమిషాలపాటు ఆడిపాడి అభిమానులను అలరించిన ఆమె, ఆ తర్వాత వేదికపై వాంతులు చేసుకుంటూ కుప్పకూలింది. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యలు ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో అక్కడ విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News