: చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: టీడీపీ నేత బుద్ధా వెంకన్న
ఏపీ సర్కార్ పై బీజేపీ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఇటువంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు మానాలని, చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. తాము కేంద్రానికి ఎలా సహకరిస్తున్నామో, ఏపీలోని బీజేపీ నేతలు కూడా అదే విధంగా సహకరించాలని ఆయన హితవు పలికారు. గత ఎన్నికల్లో బీజేపీకి 14 సీట్లు ఇస్తే నాలుగు సీట్లలో గెలిచారని, ఏపీలో బీజేపీకి ఎటువంటి బలం లేదని వెంకన్న ఎద్దేవా చేశారు.