: చచ్చినా తెలుగుదేశంలో చేరబోనంటున్న వైకాపా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు


తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వచ్చిన వార్తలపై కృష్ణా జిల్లా నూజివీడు వైకాపా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు స్పందించారు. తన ప్రాణాలు పోయినా వైకాపాను వీడబోనని ఆయన స్పష్టం చేశారు. తన కుమారుడు వెళ్లి సీఎం చంద్రబాబును కలిసినట్టు వచ్చిన వార్తలనూ ఆయన ఖండించారు. "నా కుమారుడు వెళ్లి చంద్రబాబునాయుడిని కలిసినట్టు దమ్ముంటే నిరూపించండి. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. నేనెప్పుడూ తప్పు చేయలేదు. ప్రభుత్వానికి భయపడేది లేదు" అని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News