: రైలొస్తుంది, వెళుతుంది, కానీ కనిపించదు... జపాన్ సృష్టించిన మాయ రైలు!


జపాన్ శాస్త్రవేత్తలు మరో అద్భుతాన్ని కళ్లముందు ఆవిష్కరించారు. ఓ కనపడని రైలును వీరు తయారుచేశారు. జపాన్ ఆర్కిటెక్ట్ కజుయో సెజిమా ఈ రైలును రూపొందించారు. సెయిబు గ్రూప్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది తయారైంది. రైలుకు సెమీ రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయడంతో ఇది ప్రయాణిస్తుంటే దాదాపుగా కనిపించదు. కాగా, మరో రెండేళ్ల తరువాత ఈ రైళ్లు పట్టాలపైకి వస్తాయని తెలుస్తోంది. తొలుత టోక్యో, సైతమా తదితర ఏరియాల్లో 180 కిలోమీటర్ల రైలు మార్గాలను నిర్వహిస్తున్న సెయిబు గ్రూప్ వీటిల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది. ఈ సరికొత్త డిజైన్ రైళ్లను కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు మాత్రమే అందించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News