: దేశాన్ని నాశనం చేస్తున్నారంటూ మోదీపై నిప్పులు చెరిగిన మన్మోహన్


ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కోపం వచ్చింది. దేశాన్ని నాశనం చేస్తున్నారని మోదీ సర్కారుపై ఆయన నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ కే పరిమితమైన ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు పంజాబ్ వంటి రాష్ట్రాలకు కూడా విస్తరించాయని విమర్శించారు. "పాకిస్థాన్ పట్ల ఆయన వైఖరి సిగ్గు చేటు. ఉగ్రవాదులు దేశంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. ఉగ్రవాదం పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని చెప్పేందుకు ఇటీవలి పఠాన్ కోట్ దాడులే నిదర్శనం" అని ఆయన మండిపడ్డారు. అసోంలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, గడచిన రెండేళ్లలో వ్యవసాయం కుంటుపడిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, మోదీ మాత్రం తానేదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని నిప్పులు చెరిగారు. లోక్ సభ ఎన్నికలకు ముందు భారతీయులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News