: జాతీయ పతాకాన్ని అవమానించారు.. మే 9న మోదీపై విచారణ
జాతీయ పతాకాన్ని అవమానపరిచారంటూ ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు మే9న మోదీపై విచారణ చేపట్టనున్నారు. గత ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయపతాకానికి అవమానం కలిగేలా ప్రవర్తించారని ఆశిష్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అంతేకాక గతంలో అమెరికాను సందర్శించినప్పుడు కూడా మోదీ భారత జాతీయ పతాకాన్ని అవమానపరిచారని ఆయన పేర్కొన్నారు. ప్రెవెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ కింద, భారత జాతీయ పతాక్ కోడ్ ఉల్లంఘన కింద ఈ కేసును నమోదు చేయాలని ఆయన కోరారు. మోదీ చాలా సార్లు జాతీయ పతాకాన్ని అవమానించారని ఫిర్యాదుదారు ఆశిష్ శర్మ పేర్కొన్నారు. యోగా డే నాడు మోదీ జాతీయ పతాకాన్ని హాండ్ కర్చీప్లా ఉపయోగించారని, అమెరికా పర్యటనలో ఉన్నప్పుడూ కూడా నేషనల్ ఫ్లాగ్ కోడ్ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఆశిష్ శర్మ ఫిర్యాదు మేరకు మోదీపై మే 9న విచారణ చేపట్టనున్నట్లు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ స్నిగ్ధ శర్వారియా పేర్కొన్నారు.