: నారా దేవాన్ష్ బర్త్ డే విందు రేపే!... ఎంపీలు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీయ ఆహ్వానం


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో రేపు భారీ విందు జరగనుంది. తేదీల ప్రకారం ఇప్పటికే దేవాన్ష్ బర్త్ డే పూర్తి కాగా, తిథుల ప్రకారం రేపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అతడి బర్త్ డే విందును చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు విందుకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసి ఆహ్వానించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు ఈ విందుకు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News