: కమలా అద్వానీ మృతిపై వైఎస్ జగన్ సంతాపం
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అద్వానీ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కాగా, ఈ రోజు సాయంకాలం కమలా అద్వానీకి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.