: ఉగ్రవాదంపై పోరుకు పుతిన్ కొత్త దళం 'నేషనల్ గార్డ్స్'


ఉగ్రవాదంపై పోరాటానికి రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ ప్రత్యేక దళం ఏర్పాటు చేశారు. 'నేషనల్ గార్డ్స్' పేరిట ఏర్పాటు చేసిన ఈ దళం ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరగాళ్లపై పోరాడుతుంది. ఈ దళాన్ని పూర్తిగా ప్రజా రక్షణకు వినియోగిస్తామని పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ దళాన్ని రష్యా అంతర్గత భద్రత నిర్వహించే దళం నుంచి ఏర్పాటు చేస్తారు. దీనికి పుతిన్ మాజీ బాడీగార్డ్ విక్టర్ జులటోవ్ అధిపతిగా వ్యవహరిస్తారు. ఆయన నేరుగా పుతిన్ కే జవాబుదారిగా ఉంటారు. అయితే, సెప్టెంబర్ లో నిర్వహించనున్న ఎన్నికలకు, ఈ దళం ఏర్పాటుకు సంబంధం ఉందంటూ వస్తున్న వ్యాఖ్యలను పెస్కోవ్ ఖండించారు. భద్రతాదళాల అధికారులతో క్రెమ్లిన్ లో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ దళంపై ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News