: పాకిస్థాన్ కు మరోమారు అధునాతన ఆయుధాలు విక్రయించనున్న అమెరికా


దాయాది దేశం పాకిస్థాన్ కు మరోమారు అధునాతన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ విషయమై భారత్ చేస్తున్న ఆందోళనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని అగ్రరాజ్యం తాజాగా, 17 మిలియన్ డాలర్ల విలువైన అధునాతన థర్మల్ వెపన్ సైట్స్ విక్రయించనుంది. ఈ ఆయుధాలను రేథియాన్ సంస్థ తయారు చేస్తుంది. థర్మల్ వెపన్స్ సైట్స్ కున్న నిఘా సామర్థ్యం గురించి చెప్పాలంటే, శత్రువు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అంటే దుమ్మూధూళి, పొగ, మంచు వంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిఘా పెట్టగలవు. కాగా, రూ.1,128 కోట్ల విలువ చేసే తొమ్మిది ఏహెచ్-1 జెడ్ వైఫర్ హెలికాఫ్టర్లు, రూ.4,648 కోట్ల విలువైన ఎనిమిది ఎఫ్-16 జెట్ విమానాలను పాక్ కు సరఫరా చేస్తున్నట్లు ఇంతకు ముందు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News