: జగన్ భవిష్యత్తు జైల్లోనా, బయటా? అనే అనుమానంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు!: టీడీపీ నేత సోమిరెడ్డి


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే తమ పరిస్థితేమిటనే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ ఈడీ కేసుల నుంచి బయటపడే అవకాశం లేదని, 11 కేసుల్లో జగన్ పై విచారణ జరుగుతోందని అన్నారు. జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గందరగోళంలో పడిపోయారని, భవిష్యత్ కోసమే వారు టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. ఏదేమైనప్పటికి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ జైల్లో ఉంటుందా? బయట ఉంటుందా? అనే అనుమానంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి మంచి పాత్ర పోషించటం లేదన్న అనుమానంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని సోమిరెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News