: నలుగురికి సిలువ వేసి చంపిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు


ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు వినూత్న పద్ధతుల్లో హత్యలు చేస్తూ భయాందోళనలు రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ తీవ్రవాదులు ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో నలుగురు వ్యక్తులను సిలువ వేసి తుపాకీతో కాల్చిన దృశ్యాలు ఉన్నాయి. ఐఎస్ఐఎస్ సీనియర్ టెర్రరిస్ట్ అబు అజా అల్ టునిస్ గురించిన సమాచారం సిరియా దళాలకు అందించారన్న ఆరోపణలతో ఇటీవల 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురు వ్యక్తులను సిరియా రాజధాని రక్కాలో సిలువ వేసి చంపినట్టు తెలుపుతూ ఈ వీడియో విడుదల చేశారు. కాగా, గత బుధవారం టునిస్ ను రష్యా వైమానిక దాడుల ద్వారా హతమార్చింది. రష్యా వైమానిక దాడుల రక్షణలో సిరియా దళాలు ముందంజ వేస్తుండగా, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హత్యలకు తెగబడుతున్నారు.

  • Loading...

More Telugu News