: నాకు కులాల రాజకీయం అవసరం లేదు... నన్ను అందరూ ప్రేమిస్తారు: మోహన్ బాబు
‘నాకు కులాల రాజకీయం అవసరం లేదు... నన్ను అందరూ ప్రేమిస్తారు’ అని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ‘నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా... పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూసి ప్రతిరోజూ బాధపడుతున్నాను. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలోనే నేను ఒక భాగస్వామిని అవుతాను. కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టే అలవాటు నాకు లేదు’ అని అన్నారు.