: భానుడి ప్రతాపానికి 66 మంది మృతి: తెలంగాణ సర్కార్ వెల్లడి
తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఎండ పూర్తి స్థాయిలో విరుచుకుపడే మే నెల ప్రారంభం కాకముందే భానుడి ప్రతాపానికి కొన్ని చోట్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వేసవిలో ఎండదెబ్బతో ఏప్రిల్ మొదటి వారం నాటికే 66 మంది మృతి చెందినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మహబూబ్నగర్ లో 28, మెదక్లో 11, ఖమ్మంలో ఐదుగురు, కరీంనగర్ లో ఐదుగురు, ఆదిలాబాద్ లో నలుగురు, వరంగల్లో నలుగురు, నల్గొండలో ఇద్దరు, నిజామాబాద్లో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు తెలిపింది.