: కోహ్లీకి పెద్ద అభిమానిని, ప్ర‌పంచ క్రికెట్‌ను మ‌న‌మే శాసిస్తున్నాం: బీసీసీఐ కార్యదర్శి


ఇటీవ‌లే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వరల్డ్ టీ 20 కెప్టెన్ గా ఎంపికైన భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కోహ్లి అంటే తనకెంతో ఇష్టమని, కోహ్లికి పెద్ద అభిమానిన‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వ‌ర‌ల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ కోహ్లీనేన‌ని అన్నారు. ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో ఠాకూర్ మాట్లాడుతూ.. టీ20 ప్ర‌పంచ‌ కప్ లో అభిమానులు చాలా మ‌ద్ద‌తునిచ్చార‌ని పేర్కొన్నారు. వ‌ర‌ల్డ్ క్రికెట్‌ని ప్ర‌స్తుతం మ‌న‌మే శాసిస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News