: సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న ఏపీ మంత్రులు
ఏపీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, నారాయణ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీలో ఐటీ పెట్టుబడులే లక్ష్యంగా మూడు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు వారి పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా సింగపూర్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొని ఐటీ పెట్టుబడుల విషయమై మంత్రులు చర్చించనున్నారు.