: కేటీఆర్ చిరుతపులి లాంటివాడు: కర్నె ప్రభాకర్
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను చిరుతపులితో పోల్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. 'కేటీఆర్ ఏమీ చిన్నపిల్లాడు కాదు.. చిరుతపులి లాంటోడు' అని ఆయన అభివర్ణించారు. మానవ వనరుల అభివృద్ధి కోసం కేటీఆర్ నిరంతరం పని చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ పైన, నేతలపైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాంగ్రెస్ నేతలు మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం, టీ-అసెంబ్లీలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం... వంటి విషయాలను ప్రభాకర్ ప్రస్తావించారు.