: చైన్ స్నాచింగ్ సంఘటనలో పసికందును హతమార్చింది కన్నతల్లే!
గత రాత్రి హైదరాబాద్ నేరేడ్ మెట్ లో చైన్ స్నాచింగ్ సంఘటనలో పసికందు ప్రాణాలు కోల్పోలేదని, కన్నతల్లే తన బిడ్డను హతమార్చిందని పోలీసుల విచారణలో తేలింది. గత రాత్రి నడిచి వెళుతున్న తన మెడలో గొలుసును తెంపేందుకు చైన్ స్నాచర్లు యత్నించారని, ఆ గొలుసు తెగకపోవడంతో తాను ప్రతిఘటించానని, ఆ పెనుగులాటలో తన చేతిలోని బిడ్డ కిందపడిందని తల్లి పూర్ణిమ చెప్పిన విషయాలన్నీ అవాస్తవమని పోలీసులు పేర్కొన్నారు. పూర్ణిమకు వరుసగా ముగ్గురు కుమారులు పుట్టారని, కూతురు పుట్టడం లేదనే మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని నిందితురాలు తమ విచారణ లో చెప్పిందని పోలీసులు వివరించారు.