: మంత్రి వర్గంలో చేరేందుకు లోకేశ్ కు అన్ని అర్హతలు ఉన్నాయి: మంత్రి గంటా శ్రీనివాసరావు
నారా లోకేశ్ ను ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలోకి స్వాగతిస్తున్నానని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మంత్రి వర్గంలో చేరేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. లోకేశ్ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, లోకేశ్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని టీడీపీ నేతలు ప్రతిపాదనలు చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేశ్ ను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు వీలుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రాజీనామాకు సిద్ధమని నిన్న ప్రకటించారు కూడా.