: ఇండియాలో సోషల్ మీడియా రారాజు ఫేస్‌బుక్కే!
వ్యక్తుల మధ్య అనుసంధానంగా నిలుస్తూ, సరికొత్త ఫీచర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే ఫేస్‌బుక్‌పై ఇండియన్స్ ఎంతగా మక్కువ పెంచుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇదే విషయాన్ని మార్కెట్ పరిశోధన, బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ ఐఎంఆర్బీ నిర్వహించిన అధ్యయనం మరింత స్పష్టంగా తెలియజేస్తోంది. మనదేశంలో ట్విట్టర్ కన్నా ఫేస్‌బుక్‌ను 2.4 రెట్లు ఎక్కువగా, యూట్యూబ్ కన్నా రెండు రెట్లు ఎక్కువగా వినియోగిస్తారని ఈ స్టడీ తెలుపుతోంది. ఫేస్‌బుక్‌ను ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌లలోనే వినియోగిస్తున్నారని పేర్కొంది. భారత ఫేస్‌బుక్ వినియోగదారులు 70 శాతం మంది స్మార్ట్ ఫోన్ల ద్వారానే దానికిలోకి ప్రవేశిస్తున్నారని తెలిపింది. ఇక, అర్జెంటుగా వీడియోలు, ఫైల్స్ పంపాలంటే ముందుగా గుర్తొచ్చేది వాట్సప్. ఇది కూడా భారతీయుల్లో అంతగా భాగమైపోయింది. భారత్‌లో ఫేస్‌బుక్ తర్వాత అత్యధికంగా వాట్సప్ వినియోగంలో ఉందని ఈ అధ్యయనంలో తేలింది.