: డబ్బుకు అమ్ముడుబోవడానికి సంతలో వస్తువును కాదు: వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కామెంట్


వైసీపీ టికెట్ పై గడచిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పాశం సునీల్ కుమార్ టీడీపీలోకి చేరడం ఖాయమైపోయింది. నిన్న రాత్రి ఏపీ మంత్రి నారాయణ, టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావులతో కలిసి విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో సునీల్ కుమార్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడకుండానే నెల్లూరు వెళ్లిపోయిన సునీల్ కుమార్ తాజాగా కొద్దిసేపటి క్రితం అక్కడ మీడియాతో మాట్లాడారు. డబ్బుకు అమ్ముడుబోవడానికి తానేమీ సంతలో వస్తువును కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా తాను టీడీపీలో చేరుతున్నట్లు ఆయన చెప్పకనే చెప్పేసినట్లైంది.

  • Loading...

More Telugu News