: ముంబై పేలుళ్ల కేసులో ముగ్గురికి జీవితఖైదు విధించిన కోర్టు


ముంబై పేలుళ్ల కేసులో స్పెష‌ల్ ప్రివెన్ష‌న్ ఆఫ్ టెర్ర‌రిజం యాక్ట్ (పోటా) కోర్టు కొన్ని రోజుల క్రితం పది మందిని దోషులుగా నిర్ధారించిన విష‌యం తెలిసిందే. 2002-2003 మధ్య చోటుచేసుకున్న ఈ దాడుల కేసులో న్యాయస్థానం ఈరోజు ఆరుగురికి శిక్ష ఖరారు చేసింది. మిగిలిన నలుగురు ఇప్పటికే చాలాకాలం జైలులో గడప‌డంతో, బెయిల్‌ పత్రాలు సమర్పిస్తే విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. న్యాయస్థానం శిక్ష ఖ‌రారు చేసిన ఆరుగురిలో ప్రధాన నిందితుడు ముజామిల్ అన్సారీ సహా మరో ఇద్ద‌రికి యావజ్జీవ కారగార శిక్ష ప‌డింది. కేసులో మరో ముగ్గురు దోషులు పదేళ్ల జైలు శిక్ష అనుభ‌వించ‌నున్నారు. డిసెంబర్ 2002, మార్చి 2003 మధ్య కాలంలో ముంబైలోని ప‌లు ప్రాంతాల్లో మూడు బాంబుపేలుళ్లు సంభవించాయి. ఈ ఘ‌ట‌న‌లో 12 మంది మరణించగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై సెంట్రల్ రైల్వేస్టేష‌న్‌లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో డిసెంబర్ 6, 2002న మొదటి పేలుడు, వైలీ పార్లే ఈస్ట్ లో 27 జనవరి 2002న రెండో పేలుడు సంభవించింది. ములంద్ రైల్వే స్టేషన్ లో లోక‌ల్ ట్రైన్‌లో మార్చి 13న మూడో పేలుడు జరిగింది.

  • Loading...

More Telugu News