: 9నెలల పాపను కారులో వదిలేసి పార్టీకి వెళ్లిన తండ్రి.. నిర్లక్ష్యానికి ఆరేళ్ల జైలు శిక్ష
కారులో పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లి తల్లిదండ్రులు జల్సాలు చేస్తోన్న వైనంపై పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నా అమెరికాలో అటువంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటువంటి మరో సంఘటన కాలిఫోర్నియాలో జరిగింది. డార్గిన్( 24) అనే వ్యక్తి తన తొమ్మిది నెలల పాపను ఒంటరిగా కారులో వదిలేసి ఓ క్లబ్ పార్టీలో కలిసి జల్సాచేశాడు. కారులో గంటల పాటు కూర్చోవడంతో పాప స్వల్ప అస్వస్థతకు గురై, ఏడుస్తూ కనిపించడంతో క్లబ్ అధికారులు, అక్కడ దగ్గరలో ఉన్న వారు స్పందించారు. పాపను రక్షించి పోలీసులకు ఈ విషయాన్ని తెలిపారు. వారు కేసు నమోదు చేయడంతో ఆ తండ్రికి అక్కడి న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. నిర్లక్ష్యంగా కారులో పిల్లల్ని వదిలేసి వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఘటనలు అమెరికాలో ఈ మధ్య పెరిగిపోయాయి.