: ఆ చిత్రాన్ని చైనాలో బ్యాన్ చేశారు.. కానీ టాప్ ఆసియా అవార్డ్ గెలుచుకుంది
చైనా అధీనంలో హాంకాంగ్ ఒక విషాదభరితమైన భవిష్యత్తును ఎదుర్కొంటుందంటూ రూపొందించిన ‘టెన్ ఇయర్స్’ అనే సినిమాను చైనాలో నిషేధించారు. అయితే, అనూహ్యంగా ఆ సినిమా హాంకాంగ్ ఫిల్మ్ అవార్డుల వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆసియా టాప్ ఫిల్మ్ అవార్డుల్లో ఒక దానిని సొంతం చేసుకుంది. లో-బడ్జెట్‌తో చిత్రీకరించిన ఈ మూవీ ఇటీవలే ఈ అవార్డు అందుకొని అందరి ప్రశంసలూ పొందుతోంది. బీజింగ్ అధీనంలో ఉన్న హాంకాంగ్ భవిష్యత్తులో ఎదుర్కొనే పొలిటికల్ గ్యాంగ్స్ ని గురించి, అలాగే మాండరిన్ భాష కాకుండా తమ మాతృభాష అయిన కాంటోనిస్ మాండలిక భాషను మాట్లాడుతుండడం వల్ల అక్కడి ప్రజలు హింసకు గురికావడాన్ని ఈ చిత్రంలో చూపడంతో ఈ చిత్రంపై చైనాలో నిషేధం విధించారు. కానీ హాంకాంగ్‌లో మాత్రం ఇది ప్రదర్శితమైంది.