: చంద్రబాబు సమీక్షల పర్వం... నేడు బిజీబిజీగా ఏపీ సీఎం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సమావేశాల కోసం విజయవాడను వదిలి హైదరాబాదు చేరిన సీఎం నారా చంద్రబాబునాయుడు మొన్నటిదాకా భాగ్యనగరిలోనే ఉండిపోయారు. తిరిగి విజయవాడ చేరుకున్న చంద్రబాబు మళ్లీ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో నేడు ఆయన మరింత బిజీ షెడ్యూల్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు తనను కలిసేందుకు వచ్చే పార్టీ నేతలు, సందర్శకులను కలవనున్న చంద్రబాబు, ఆ తర్వాత 3 గంటలకు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధి కమిటీతో భేటీ కానున్నారు. తదనంతరం 4.15 గంటలకు కాపు కార్పొరేషన్, 5 గంటలకు మైనారిటీ సంక్షేమంపై చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు అంబేద్కర్ జయంత్యుత్సవాల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్షించనున్నారు.