: పూణె విమానాశ్రయంలో ఐఎస్ ఉగ్రవాది అరెస్టు
మహారాష్ట్రలోని పూణె విమానాశ్రయంలో ఐఎస్ ఉగ్రవాది పట్టుబడ్డాడు. దుబాయ్ కు వెళుతున్న రవూఫ్ అహ్మద్ అనే ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి సిరియా వెళ్లేందుకు రవూఫ్ పథకం సిద్ధం చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. రవూఫ్ స్వస్థలం కర్ణాటకలోని భత్కళ్ అని సమాచారం.