: ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారు: పవర్ స్టార్ పవన్ కల్యాణ్
అలనాటి మేటి నటుడు ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నాడు. ఆయన లాంటి నటుడెవ్వరూ ఉండరని, ఆయనకు ఆయనే సాటి అని అన్నాడు. బాలీవుడ్ మీడియాకు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ ఈ విషయాలు చెప్పాడు. ఇక తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ, ఆయనకు తాను పెద్ద అభిమానినని చెప్పాడు. క్రేజ్ విషయంలో చిరంజీవికి పోటీ తాను కాదని చెప్పాడు. పాటలు, డ్యాన్స్ లప్పుడు తాను చాలా ఇబ్బంది పడతానని ఆ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు. కాగా, పవర్ స్టార్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఈ నెల 8న విడుదల కానుంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.